MLG: వెంకటాపురం మండల పరిషత్ కార్యాలయంలో గురువారం జరిగిన సర్వసభ్య సమావేశంలో బర్లగూడెం సర్పంచ్ ఆదిలక్ష్మి తాగునీటి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మిషన్ భగీరథ నీరు సక్రమంగా అందక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రత్యామ్నాయ పైపులైన్ ఏర్పాటు చేసి గ్రామాలకు నీరు అందించాలని కోరారు. పరిశీలించి చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కోన్నారు.
తెలంగాణ
'తాగునీటి సమస్యపై దృష్టి సారించండి'


