హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతు సంఘం ఛైర్మన్‌గా నర్రా శ్రీనివాస్‌రెడ్డి

KNR: సింగపూర్ రైతు వేదికలో హుజురాబాద్ రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం వార్షిక మహాసభ నిర్వహించారు. సంఘం నూతన ఛైర్మన్‌గా నర్రా శ్రీనివాస్‌రెడ్డిని 15 మంది పాలకవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో రైతు సమస్యలు, సంఘం అభివృద్ధిపై చర్చించారు. తుమ్మనపల్లి, సింగపూర్, మాందాడిపల్లి, పోతిరెడ్డిపేట గ్రామాల రైతులు పాల్గొన్నారు.