KNR: హుజురాబాద్ పట్టణంలో జరిగిన వినాయక నిమజ్జనంలో గణేశ్ విగ్రహాలను జేసీబీలతో ఒకదానిపై మరొకటి వేసి ధ్వంసం చేయడం బాధాకరమని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. రోజుల తరబడి భక్తిశ్రద్ధలతో పూజించిన విగ్రహాలకు ఈ పరిస్థితి రావడం ఆవేదన కలిగించిందన్నారు. నిమజ్జనానికి సరిపడా నీటిని విడుదల చేయాలని అధికారులను కోరినా పట్టించుకోలేదని ఆరోపించారు.
తెలంగాణ
నిమజ్జనంలో విగ్రహాల పట్ల నిర్లక్ష్యం బాధాకరం


