BHPL: రేగోండ మండల కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో శుక్రవారం పంటల సాగుపై రైతులకు అవగాహన సమావేశం నిర్వహించనున్నట్లు వ్యవసాయ శాఖ ఏవో వాసుదేవరెడ్డి తెలిపారు. ఉదయం 11 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత సాగు పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పంటల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
నేడు రైతు వేదికలో సాగుపై అవగాహన


