హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ప్రకాశం బ్యారేజీ నుంచి నీటి విడుదల

NTR: విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం పెరిగింది. మున్నేరు, బుడమేరు నుంచి భారీగా వరద నీరు చేరడంతో అధికారులు గురువారం రాత్రి 20 గేట్లు ఎత్తారు. బ్యారేజీ నుంచి 14,500 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ సీజన్‌లో తొలిసారిగా ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి మిగులు జలాలను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.