ATP: జడ్పీ ఛైర్‌పర్సన్‌గా ఐదేళ్ల పదవీకాలం పూర్తిచేసిన బోయ గిరిజమ్మకు జడ్పీటీసీలు, సిబ్బంది ఆత్మీయ వీడ్కోలు పలికారు. గురువారం జడ్పీ సమావేశ మందిరంలో సభ నిర్వహించారు. ఐదేళ్లలో 180 మందికి కారుణ్య నియామకాలు, 301 మందికి పదోన్నతులు కల్పించామని గిరిజమ్మ తెలిపారు. రూ.129.53 కోట్లతో రోడ్లు, తాగునీరు తదితర అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ముగిసిన జడ్పీ ఛైర్‌పర్సన్ పదవీ కాలం


