GDWL: మానవపాడు మండలం చెన్నిపాడులో విషాదం చోటుచేసుకుంది. హమాలీ కార్మికుడు తెలుగు నాగేంద్ర(33) తీవ్రమైన గుండె నొప్పి భరించలేక ఇంట్లో ఉరేసుకుని మృతిచెందాడు. గురువారం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఘటనకు పాల్పడినట్టు స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ స్వాతి తెలిపారు.
తెలంగాణ
ఉరేసుకొని వ్యక్తి బలవన్మరణం


