కృష్ణా: తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు ఇవాళ స్థానిక సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సెలవు అమలు చేయాలని సూచించారు. విద్యార్థులు వర్షాల్లో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నేడు పాఠశాలలకు సెలవు: డీఈవో


