ఖమ్మం: ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి సీతక్క ఈరోజు సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఐఓడీసీలో సమావేశం జరగనుంది. తాగునీరు, హ్యామ్ రహదారులు, భవన నిర్మాణాలు, పెండింగ్ పనులు, ఎల్నినో ప్రభావం తదితర అంశాలపై చర్చించనున్నారు. తాజా వివరాలతో అధికారులు హాజరుకావాలని సూచించారు.
తెలంగాణ
నేడు వరంగల్, ఖమ్మం జిల్లాలపై సమీక్ష


