హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వర్షాలు.. బస్సు సర్వీసులు నిలిపివేత

AKP: జిల్లాలో గురువారం 35 బస్సు సర్వీసులను రద్దు చేశారు. అనకాపల్లి, నర్సీపట్నం డిపోల పరిధిలోని మొత్తం 191 సర్వీసుల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. రోడ్లు ప్రమాదకరంగా మారిన ప్రాంతాల్లో ప్రయాణికుల భద్రత కోసమే రాకపోకలు నిలిపినట్లు DPTO ప్రవీణ తెలిపారు. పరిస్థితులను పరిశీలించిన తర్వాతే శుక్రవారం సర్వీసుల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.