NGKL: నాగర్‌కర్నూల్ పట్టణంలో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవకుండా అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
నాగర్‌కర్నూల్‌లో భారీ వర్షం


