హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాఠశాల కమిటీ ఎన్నికలకు కసరత్తు

AKP: నియోజకవర్గంలోని 241 ప్రభుత్వ బడుల్లో ఎస్‌ఎంసీ ఎన్నికల కసరత్తు మొదలైనట్లు సమగ్ర శిక్షా విభాగం తెలిపింది. మండలాల వారీగా రావికమతం 4,760, చోడవరం 4,501, బుచ్చెయ్యపేట 3,751, రోలుగుంట 2,500 మంది ఓటర్లున్నారు. ఇప్పటికే పాఠశాలల్లో జాబితాలు ప్రదర్శించగా, ఈ నెల 29న పోలింగ్ జరగనుంది. విద్యార్థి తల్లిదండ్రుల్లో ఒక్కరికే ఓటు హక్కు ఉంటుందని అధికారులు తెలిపారు.