హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైద్య విద్యార్థిని ఆత్మహత్య

VSP: పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. రామ్ నగర్‌కు చెందిన పెదిరెడ్ల శైలజ (27) ఆంధ్రా మెడికల్ కళాశాలలో పీజీ జనరల్ మెడిసిన్ చివరి సంవత్సరం చదువుతోంది. నిన్న పరీక్ష ఉన్నా గదిలో నుంచి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు గమనించి చూడగా ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.