హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

35 వైన్ షాపుల లైసెన్స్‌లకు నోటిఫికేషన్

కృష్ణా జిల్లాలో 135 మద్యం దుకాణాలకు గాను 100 దుకాణాల లైసెన్స్‌లను రెన్యువల్ చేసినట్టు ఎక్సైజ్ సూపరింటెండెంట్ తెలిపారు. మిగిలిన 35 దుకాణాల రెన్యువల్‌కు లైసెన్స్‌దారులు ముందుకు రాకపోవటంతో ఆ దుకాణాలకు అక్టోబర్ 5న కలెక్టరేట్‌లో వేలం పాట నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. అక్టోబర్ 1 వరకు దరఖాస్తుల స్వీకరణ 2, 3 తేదీల్లో పరిశీలన ఉంటుందన్నారు.