SKLM: టెక్కలి మండలంలోని పెద్దసాన గ్రామానికి చెందిన సీపాన రేష్మశ్రీ నీట్ పీజీ పరీక్షలో జాతీయస్థాయిలో ప్రతిభ కనబరిచింది. ఆల్ ఇండియా స్థాయిలో 171వ ర్యాంకు సాధించి గ్రామానికి గర్వకారణంగా నిలిచింది. గతంలో 2019లో నీట్ యూజీలో రాష్ట్రస్థాయిలో 300వ ర్యాంకు సాధించి ఆంధ్రా మెడికల్ కళాశాలలో వైద్య విద్యను అభ్యసించినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నీట్ పీజీలో సత్తాచాటిన రేష్మశ్రీ


