హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భక్తిశ్రద్ధలతో గార్మి జెండా వేడుకలు

KDP: జమ్మలమడుగు వేంకటేశ్వర కాలనీలో గార్మి జెండా పండుగ వేడుకలు గురువారం రాత్రి భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగాయి. టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేశ్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. హిందూ, ముస్లిం సోదరులు కలసికట్టుగా పాల్గొని మతసామరస్యాన్ని చాటారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ ఛైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.