హైదరాబాద్: 28°C
తెలంగాణ

దోమకొండ చెరువులో పడి యువకుడి మృతి

KMR: దోమకొండ చెరువులో ఇనుప స్టాండ్ల కోసం వెళ్లిన బీబీపేటకు చెందిన లింగారి నవీన్ (17) నీటిలో మునిగి మృతి చెందినట్లు ఎస్ఐ ప్రభాకర్ తెలిపారు. గురువారం ఉదయం నవీన్, మరో వ్యక్తితో కలిసి చెరువు వద్దకు వెళ్లినట్లు చెప్పారు. ఇనుప సామాను కోసం నీటిలోకి దిగిన నవీన్ తిరిగి వస్తుండగా అస్వస్థతకు గురై నీటిలో మునిగిపోయినట్లు తెలిపారు.