హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చింతపల్లిలో భారీ వర్షానికి కూలిన ఇంటి గోడ

అల్లూరి జిల్లా చింతపల్లి మండలం చౌడేపల్లి పంచాయతీ సత్యవారం గ్రామ పాత వీధిలో భారీ వర్షానికి ఇంటి గోడ కూలిపోయింది. సత్యవారం గ్రామానికి చెందిన గెమ్మెలి వెంకట్రావు గారి ఇల్లు అతి భారీ వర్షలకు గోడ పూర్తిగా కూలిపోయింది. ఇంట్లో ఉన్న నిత్యవసర, సరుకులు, ధాన్యం గింజలు వర్షం నీటికి తడిసి పాడైపోయాయి. అదృష్టవశాత్తు ఇంట్లో ఉన్నవారికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.