హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అధిక వర్షాలపై జిల్లా యంత్రాంగం అప్రమత్తం

E.G: వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని గురువారం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అన్ని స్థాయిల్లో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆమె ఆదేశించారు. కంట్రోల్ రూమ్‌లను 24 గంటలూ అందుబాటులో ఉంచాలని కలెక్టర్ స్పష్టం చేశారు.