హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

36, 42 డివిజన్‌లలో MLA ఆదిరెడ్డి పర్యటన

E.G: తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ 36, 42 డివిజన్లలోని పలు ప్రాంతాల్లో పర్యటించి వర్షపు నీటి పరిస్థితిని పరిశీలించారు. స్థానికులతో మాట్లాడిన ఎమ్మెల్యే వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొత్తగా నిర్మించిన అనుసంధాన డ్రైనేజీ వ్యవస్థల కారణంగా వర్షపు నీరు వేగంగా బయటకు వెళ్తోందని వివరించారు.