హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు వెంకటాపూర్‌లో మంత్రి సీతక్క పర్యటన

MLG: వెంకటాపూర్ మండలంలో శుక్రవారం మంత్రి సీతక్క పర్యటించనున్నట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బండి శ్రీనివాస్ తెలిపారు. నల్లగుంటలో ఉదయం 9 గంటలకు నూతన సీసీ రోడ్లకు శంకుస్థాపన చెయ్యనున్నారు. అనంతరం లక్ష్మీదేవిపేటలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని నూతన గ్రామ కమిటీ అధ్యక్షులను సన్మానించనున్నారు.