SDPT: బెజ్జంకి మండలం బేగంపేట గ్రామానికి చెందిన జనగాం శంకర్‌ను జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. రాష్ట్ర ఎస్సీ సెల్ ఛైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు గురువారం సిద్దిపేటలోని కాంగ్రెస్ కార్యాలయంలో నియామక పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకులు సముద్రాల లక్ష్మణ్, విజయ్ ఉన్నారు.
తెలంగాణ
ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా శంకర్


