హైదరాబాద్: 28°C
తెలంగాణ

వాహనాల నకిలీ నంబర్‌లపై కేసులు

MDK: కౌడిపల్లి మండలం ధర్మసాగర్ వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో నకిలీ నెంబర్ ప్లేట్లతో తిరుగుతున్న ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అమర్ తెలిపారు. బైక్‌ల నెంబర్ ప్లేట్లకు, ఛాసిస్ నెంబర్లకు సంబంధం లేకపోవడంతో జంగం శ్రీశైలం, రవీందర్‌లపై కేసులు నమోదు చేశారు. వాహనాల ఒరిజినల్ రిజిస్ట్రేషన్ వివరాలు మార్చి నకిలీ నెంబర్లతో తిరుగుతున్నట్లు విచారణలో తేలిందన్నారు.