హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాడిచర్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై

BHPL: భారీ వర్షాల నేపథ్యంలో తాడిచర్ల గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప బయటకు రావద్దని కోయ్యూరు ఎస్సై మహేందర్ కుమార్ సూచించారు. వర్షాల కారణంగా చెరువులు, కుంటలు, వాగులు, కాలువలు, నదుల్లో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన కోరారు.