BDK: భారీ వర్షాలతో చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. గురువారం సాయంత్రం ప్రాజెక్ట్ 13 గేట్లను ఎత్తి 1,732 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 74 మీటర్లు కాగా, ప్రస్తుతం 73.16 మీటర్లకు చేరిందని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
తెలంగాణ
తాలిపేరుకు భారీ వరద.. 13 గేట్లు ఎత్తివేత


