SRCL: వేములవాడలో SGTU జిల్లా ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. జగిత్యాల జిల్లా చిల్వకోడూరు పాఠశాల ఉపాధ్యాయుడి ఆత్మహత్యాయత్నం నేపథ్యంలో పని భారం, అధికారుల ఒత్తిడిని తగ్గించాలని డిమాండ్ చేశారు. SGTU జిల్లా అధ్యక్షుడు బారాజు రమణరెడ్డి మాట్లాడుతూ.. బోధనతో పాటు ఆన్‌లైన్ పనులు, రికార్డులు, సమావేశాలు, తనిఖీలు వంటి అదనపు బాధ్యతలతో ఒత్తిడి పెరుగుతుందన్నారు.
తెలంగాణ
'ఉపాధ్యాయులపై పని భారం తగ్గించాలి'


