హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రకృతి వైపరీత్యాలపై అధికారుల సమావేశం

కోనసీమ: భారీ వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు అమలాపురం తహసీల్దార్ దివాకర్ ఆధ్వర్యంలో గురువారం అధికారులతో సమావేశం నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలు, సహాయక కార్యక్రమాలపై చర్చించారు. శాఖల మధ్య సమన్వయంతో ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలని సూచించారు.