హైదరాబాద్: 28°C
తెలంగాణ

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

ADB: ఆదిలాబాద్‌ కేఆర్‌కే కాలనీలోని డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. గురువారం అధికారులతో కలిసి కాలనీని సందర్శించి శానిటేషన్, విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ తదితర మౌలిక వసతుల కల్పనను పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అందుబాటులోకి తేవాలని సూచించారు.