హైదరాబాద్: 28°C
తెలంగాణ

నల్లచెరువు మత్తడికి లీకేజీ

KNR: సైదాపూర్‌లోని నల్లచెరువు మత్తడి వద్ద లీకేజీ ఏర్పడి నీరు వృథాగా పోతోంది. చెరువు కళ్లముందే ఖాళీ అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లీకేజీ కొనసాగితే వేసవిలో నీటి ఎద్దడి తీవ్రంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు స్పందించి మత్తడికి మరమ్మతులు చేపట్టి జలాలను కాపాడాలని కోరుతున్నారు.