హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రణయ్ హత్య కేసు నిందితుడు మృతి

NLG: సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ఏ4 (A4) నిందితుడిగా జీవిత ఖైదు అనుభవిస్తున్న అబ్దుల్ బారీ ఈరోజు మృతి చెందాడు. చర్లపల్లి జైలులో ఉన్న అతడు హఠాత్తుగా గుండెనొప్పితో అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే జైలు సిబ్బంది అతడిని హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ కన్నుమూశాడు.