హైదరాబాద్: 28°C
తెలంగాణ

మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే

KMM: గణేష్ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వేళ వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ గురువారం ఏన్కూరు మండల కేంద్రంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు తమ ప్రాంతంలో నెలకొన్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను సావధానంగా విన్న ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.