హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి: AEO

RR: కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవడం తప్పనిసరి అని AEO రాజేశ్వరి తెలిపారు. కేశంపేట్ మండలం ఇప్పలపల్లిలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఫార్మర్ రిజిస్ట్రీతో ఫార్మర్ ఐడీ లభిస్తుందని, పీఎం-కిసాన్ నిధులు, ఎరువుల బుకింగ్, మద్దతు ధరకు పంట విక్రయం సులభమవుతాయని చెప్పారు. పాస్‌బుక్, ఆధార్‌తో ఏఈఓ లేదా మీ-సేవను సంప్రదించాలన్నారు.