RR: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మినీస్టేడియం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. గురునానక్ కళాశాల ఎదురుగా సర్వే నంబర్ 320లో ఉన్న స్థలాన్ని ఎమ్మెల్యే రంగారెడ్డి పరిశీలించారు. స్టేడియం నిర్మాణానికి ఆరున్నర ఎకరాలు కేటాయించేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని ఆర్డీవోను ఆదేశించారు. విద్యార్థులకు ఇచ్చిన మాటకు కట్టుబడి స్టేడియం ఏర్పాటు బాధ్యత తనదేనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
తెలంగాణ
ఇబ్రహీంపట్నంలో మినీస్టేడియానికి గ్రీన్‌సిగ్నల్


