హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెడ్‌క్రాస్‌ ఎన్నికలకు సర్వం సిద్ధం: RDO

MDK: జిల్లా ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ మేనేజింగ్‌ కమిటీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. నామినేషన్ల గడువు ముగిసే నాటికి 23 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి, ఆర్డీవో డా.కె.రమాదేవి తెలిపారు. ఈనెల 26న ఉపసంహరణ, తుదిజాబితా ప్రకటిస్తామని, అక్టోబర్‌ 4న పోలింగ్‌ నిర్వహిస్తామని వెల్లడించారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.