GDWL: కేటీదొడ్డి మండలంలో గుంతలమయంగా మారిన రహదారిని బాగుచేసి, బస్సు సర్వీసులు పునరుద్ధరించాలని యువ నాయకుడు గాజుల కృష్ణారెడ్డి అడిషనల్ కలెక్టర్ నరసింగరావుకు గురువారం వినతిపత్రం అందజేశారు. కొండాపురం, వెంకటాపురం మీదుగా ఇర్కిచేడు నుండి కర్ణాటక సరిహద్దు వరకు రోడ్డు అధ్వానంగా మారడంతో బస్సులు రావడం లేదని, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
తెలంగాణ
'రోడ్డు మరమ్మతులు చేసి బస్సులు నడపాలి'


