హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాకు ఆరెంజ్ అలర్ట్

WGL: జిల్లాకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డా. సత్య శారద సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే జిల్లా కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని కలెక్టర్ తెలిపారు.