హైదరాబాద్: 28°C
తెలంగాణ

బ్యానర్లు చించివేతపై పోలీసులకు ఫిర్యాదు

RR: గణేష్ నిమజ్జనం సందర్భంగా జీహెచ్ఎంసీ 53, 56 డివిజన్ల బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన బ్యానర్లను గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి చించివేశారు. సాగర్ హైవే, మాసబ్ చెరువు సమీపంలోని జేబీ గార్డెన్స్ ఎదురుగా ఈ ఘటన చోటుచేసుకుంది. బ్యానర్లు చించిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని బీజేపీ డివిజన్ అధ్యక్షుడు ఎలిమినేటి నరసింహ రెడ్డి ఆదిబట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.