హైదరాబాద్: 28°C
తెలంగాణ

20 ఏళ్ల రోడ్డుకు మోక్షమెప్పుడో?

VKB: బంట్వారం–తోర్మామిడి రహదారి అధ్వానంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 20 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ రోడ్డుపై పెద్దఎత్తున గుంతలు ఏర్పడి రాకపోకలకు ఆటంకంగా మారాయి. ప్రభుత్వాలు మారుతున్నా రహదారి సమస్య పరిష్కారం కావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.