హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీసులపై దాడి.. ముగ్గురికి జైలు శిక్ష

ADB: భీంపూర్ మండలం తాంసి(K)లో గంజాయి మొక్కల పరిశీలనకు వెళ్లిన పోలీసులపై దాడి చేసిన ముగ్గురు నిందితులకు ఏడాది జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు తీర్పునిచ్చారు. 8 మంది సాక్షులను విచారించి నేరం రుజువు చేశారు. కేసును త్వరగా ఛేదించి, నిందితులకు శిక్ష పడేలా శ్రమించిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు.