హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి'

WNP: పాఠశాలల్లో విద్యార్థుల భద్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు మిద్దె మహేష్ డిమాండ్ చేశారు. రేవల్లి జెడ్పీహెచ్‌ఎస్‌ను సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. 9వ తరగతి విద్యార్థి భాను ప్రకాష్‌ను ఉపాధ్యాయుడు కొట్టడంతో గాయమైందన్న ఆరోపణలపై ఆరా తీసి, ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని కోరారు.