హైదరాబాద్: 28°C
తెలంగాణ

బస్టాండ్‌లో బీజేపీ నేతల వినూత్న నిరసన

HNK: వర్షపు నీరు నిలిచి హనుమకొండ బస్టాండ్‌ ప్రాంగణం జలమయమై చెరువును తలపిస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని బీజేపీ రాష్ట్ర నాయకుడు గోపికృష్ణ ఆరోపించారు. నిరసనలో భాగంగా బస్టాండ్‌ ఆవరణలోని గుంతలో నిలిచిన నీటిని బయటకు పోసి నిరసన తెలిపారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు, ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్‌ చేశారు.