హైదరాబాద్: 28°C
తెలంగాణ

​డీసీసీ నూతన అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డికి సన్మానం

SRD: డీసీసీ నూతన అధ్యక్షుడిగా ఎంపికైన పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డిని ఖేడ్‌లో గురువారం కంగ్టి మండలం రాజారాం తండా సర్పంచ్ మణిరామ్, పలువురు కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీ పురోగతికి కృషి చేయాలని వారు కోరారు.