హైదరాబాద్: 28°C
తెలంగాణ

కారు ఆగిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్

JN: జనగామ పట్టణంలో సిద్దిపేట వైపు వెళ్లే ఫ్లై ఓవర్‌పై ఇంజన్ సమస్యతో ఓ కారు ఆగిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జనగామ-సిద్దిపేట ప్రధాన రహదారి కావడంతో ఫ్లై ఓవర్‌పై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఫ్లై ఓవర్‌పైకి చేరుకుని కారును తోసుకుంటూ పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. దీంతో వాహనాల రాకపోకలు సజావుగా కొనసాగాయి.