హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజాపేటలో ఘనంగా లక్ష ఉండ్రాల్ల ప్రత్యేక పూజలు

BHNG: రాజాపేట మండల కేంద్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం 11వ రోజు ప్రధాన అర్చకులు చలివేదుల వెంకట రామకృష్ణ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో లక్ష ఉండ్రాల్ల పూజలు నిర్వహించారు. శ్రీ రామకృష్ణ సాయి మందిరంలో జరిగిన ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.