WGL: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా బ్రాంచ్ డైరెక్టర్ పదవికి చొప్పరి సోమయ్య నామినేషన్ దాఖలు చేశారు. గురువారం వరంగల్ జిల్లా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు. రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా ప్రజలకు మరింత సేవలందించేందుకు కృషి చేస్తానని సోమయ్య తెలిపారు. ఆయన నామినేషన్ దాఖలు కార్యక్రమంలో సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
రెడ్‌క్రాస్ సొసైటీ డైరెక్టర్‌గా సోమయ్య నామినేషన్


