హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్మికుల సంక్షేమానికి లేబర్ కార్డులు

RR: యాచారం మండలం గున్‌గల్‌లో సర్పంచ్ బాసాని బుచ్చిరెడ్డి నేతృత్వంలో లేబర్ కార్డులు పంపిణీ చేశారు. అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల సంక్షేమానికి లేబర్ కార్డులు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని తెలిపారు. కార్మికులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మొత్తం 120 మందికి లేబర్ కార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అనిల్ కుమార్, కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.