KMM: చింతకాని మండలం నాగులవంచలో వర్షాలతో బండి రేవు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అధికారులు నాగులవంచ, రైల్వే కాలనీ మధ్య రాకపోకలు నిలిపివేశారు. వర్షం పడితే బోనకల్, చింతకాని మండలాలకు చెందిన పది గ్రామాల ప్రజలు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద తగ్గుముఖం పట్టే వరకు రాకపోకలు కొనసాగించవద్దని అధికారులు సూచించారు.
తెలంగాణ
ఉద్ధృతంగా బండి రేవు వాగు.. రాకపోకలు బంద్


