హైదరాబాద్: 28°C
తెలంగాణ

జనగామలో కుల బహిష్కరణ వేధింపులు

జనగామ జిల్లాలోని ఓ గ్రామంలో కుల బహిష్కరణ పేరుతో కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ బాధితులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. రోజురోజుకూ మానసికంగా వేధిస్తున్నారని ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్‌ విచారణ చేపట్టాలని ఆదేశించారు. సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.