హైదరాబాద్: 28°C
తెలంగాణ

అయిజ ఎంపీడీవోగా గడ్డం కృష్ణయ్య బాధ్యతల స్వీకారం

గద్వాల జిల్లా ఐజ నూతన ఎంపీడీవోగా గడ్డం కృష్ణయ్య గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో సిద్దిపేట జిల్లా కోహెడ మండల ఎంపీడీవోగా పనిచేసిన ఆయన, ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా ఇక్కడికి వచ్చారు. మండల సర్వతోముఖాభివృద్ధికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.