హైదరాబాద్: 28°C
తెలంగాణ

లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన ఎస్ఐ

KMM: జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో వైరా మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ నగర్ కాలనీలో లోతట్టు ప్రాంతాలను గురువారం ఎస్ఐ పుష్పాల రామారావు పరిశీలించారు. కాలనీలో నీరు నిలిచిన ప్రాంతాలను పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడి వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో అధికారులను సంప్రదించాలని ఆయన సూచించారు.